Tuesday, 3 November 2026

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయానికి పూజ చేసిన ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్ట్ 7

అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ పరిధి సాయి సూర్య ఎంక్లోవ్ లో ఆదివారం అల్వాల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నిర్మాణ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా హాజరైన మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేను, ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆలయ నిర్మాణంలో సహాయ సహకారాలు అందించడంలో మాటలతో కాదు చేతలలో చూపెడతానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మచ్చ బొల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్, నాయకులు కొండల్ రెడ్డి, బలవంత రెడ్డి, నాగేశ్వరరావు, రాజసింహారెడ్డి, జోగిరాజు, సురేందర్ రెడ్డి, ప్రవీణ్, మధు, ఉదయ్, రాజు యాదవ్ అల్వాల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సిరిపురం ఆనంద్ బాబు, ప్రధాన కార్యదర్శి గరిపెల్లి విద్యాసాగర్, ఉపాధ్యక్షులు దేచు గంగాధర్, సంయుక్త కార్యదర్శి ఎర్ర అంజయ్య, వంశీ కృష్ణ, పెద్ది రమేష్, చంద్రశేఖర్, నరేష్ కుమార్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.