శ్రీ వీరభద్రుని సన్నిధిలో సీఎం కేసీఆర్ పేరు మీద ప్రత్యేక పూజలు చేయించిన

మంత్రి సత్యవతి రాథోడ్

– గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు

కురవి సెప్టెంబర్-19
(జనం సాక్షి న్యూస్)

కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో  ముఖ్యమంత్రి కేసీఆర్  పేరున తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. పూజానంతరం
.భద్రకాళి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు  చెల్లించి పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంపు,గిరిజన బంధు ఆమలు చేస్తామని ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్,  వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద కురవి ఆలయంలో అర్చనలు, అభిషేకాలు  మంత్రి సత్యవతి రాథోడ్ చేయించారు.ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ….
గిరిజన ఆరాధ్య దైవం కేసీఆర్,గిరిజనుల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి వాటిని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని,హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్ లో సంత్ సేవాలాల్, ఆదివాసి కొమురం భీమ్ ల ఆత్మగౌరవ భవనాలను నిర్మించి వారి అమృత హస్తాలతో ప్రారంభించారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బంజారా ,ఆదివాసి సోదరులకు  ధన్యవాదాలు తెలియజేశారు.
గిరిజన రిజర్వేషన్ పెంపుపై 2017లో అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించి బిల్లును కేంద్రానికి పంపితే కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. ఎంతోకాలంగా నిరీక్షణ,గిరిజన రిజర్వేషన్ పెంపు పై విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని,10% శాతం పెంచుతామని కేసీఆర్ ప్రకటించడం ఎంతో సంతోషకరం ఉందని,
పోడు భూముల సమస్య పరిష్కారం కోసం  జీవో ఇవ్వడం జరుగుతుందన్నారు.దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న గిరిజన ఆదివాసీలకు గిరిజన బంధు ప్రకటించి,వారి జీవితాల్లో వెలుగు నింపుతున్న  ముఖ్యమంత్రి కేసీఆర్ కు మా గిరిజను అందరూ రుణపడి ఉన్నామన్నారు.
ఈ కార్యక్రమంలో  జిల్లా జడ్పీ చైర్ పర్సన్ అంగోత్  బిందు, కురవి జడ్పిటిసి బండి వెంకటరెడ్డి,బయ్యారం పిఎసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, సర్పంచులు కొమ్మినేని రవీందర్, రంగమ్మ,నెహ్రూ నాయక్, హరి ప్రసాద్,భూక్య జీవన్,వినోద్ నాయక్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గుగులోత్ కిషన్ నాయక్,అంగోత్ శ్రీకాంత్,బండి లక్ష్మారెడ్డి,నరహరి,అనిల్ రెడ్డి,డాక్టర్ సుందర్ నాయక్,నాగన్న,అర్జున్, జానీ మియా,సూరయ్య,స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Attachments area