Tuesday, 3 November 2026

శ్రీ వీరభద్రుని సన్నిధిలో ప్రారంభమైన దుర్గాదేవి నవరాత్రి వేడుకలు.

ఆలయ కమిటీ చైర్మన్ బాదావత్ రాము నాయక్.

కురవి సెప్టెంబర్-26 (జనం సాక్షి న్యూస్)

కురవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానము నందు ఆలయ కమిటీ చైర్మన్ బాదావత్ రాము నాయక్, ఆలయ కార్యనిర్వాహన అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో దుర్గాదేవి విగ్రహమును ప్రతిష్టించి నవరాత్రి వేడుకలను ప్రారంభించారు. చైర్మన్ రాము నాయక్ దంపతులు వేద పండితులు దుర్గామాతకు పూజలు చేయగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాదావత్ రామునాయక్-శాంతమ్మ,దర్మకర్తలు సిహెచ్ మల్లయ్య, వెంకటరమణ, ఆలయకార్యనిర్వాహణాధికారి సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, ఆలయ అర్చకులు, భక్తులు,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.