సెలవులకు ఊరేళ్తే సమాచారం ఇవ్వండి
– సిఐ బొమ్మెర బాలకృష్ణ,
అశ్వరావుపేట సెప్టెంబర్ 26( జనం సాక్షి )
అశ్వారావుపేట మండల వాసులు దసరా పండుగ సెలవులకు ఇంcటిని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లే వారు అశ్వారావుపేట పోలీసులకు సమాచారం అందించాలని అశ్వారావుపేట సిఐ బొమ్మెర బాలకృష్ణ అన్నారు. సోమవారం అశ్వారావుపేట విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ వినీత్. జీ, పాల్వంచ డీఎస్పీ సత్యనారాయణ ఆదేశాల మేరకు అశ్వారావుపేట మండల పరిధిలో నివసించే పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు దసరా సెలవుల సందర్భంగా ఊరు వెళ్లే వారు పోలీసులకు ముందస్తు సమాచారం అందించాలన్నారు.
ఈ నెంబరు కు వాట్సాప్ 8464803025 ద్వారా వారి పూర్తి వివరాలను, గూగుల్ లొకేషన్ ను పంపించడం ద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఉంటుందన్నారు. పోలీసు బీట్ పెట్రోలింగ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, గస్తి సమయంలో మీ ఇల్లు ఉన్న ప్రాంతాన్ని ఎక్కువసార్లు విజిట్ చేయడం జరుగుతుందని, సాధ్యమైనంతవరకు విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును తమ ఇండ్లలో ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మీ ఇంటికి నాణ్యమైన తాళాలు వేయాలని, ఒకవేళ మీ ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నట్లయితే వాటిని మధ్య మధ్యలో పరిశీలించుకోవాలన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు మీకు సమాచారం తెలిస్తే ఆలస్యం చేయకుండా డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. మీ ఇంటి పక్కన ఉన్న వారికి కూడా అప్పుడప్పుడు ఫోన్ ద్వారా కాంటాక్ట్ లో ఉండాలన్నారు.