Tuesday, 3 November 2026

శ్రీ శ్రీ గంగా మాత మైసమ్మ తల్లి ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

రాయికోడ్ జనం సాక్షి ఫిబ్రవరి 24 రాయికోడ్ మండల పరిధిలోని హుస్నాబాద్, ఔరంగనగర్, నాగన్ పల్లి గ్రామాల పరిధి సమీపంలో ఉన్న బొగ్గులపల్లి ప్రాజెక్టు కట్టపై వెలసిన శ్రీ శ్రీ గంగా మాత మైసమ్మ తల్లి ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9 గంటలకు రవిశ పంచనం , నవగ్రహవా వారధిని మండపం భారతి నా జల నివాసం తదుపరి యాత్ర ప్రతిష్ట బహుమాన నివాస యజ్ఞం ప్రారంభం నవచండి హోమం మధ్యాహ్నం రెండు గంటలకు పూర్ణ అవితి దత్తుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల శ్రీ శ్రీ దేవగిరి మహారాజ్ ఆదిలక్ష్మి అశేష మఠ పీఠాధిపతి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. రేపు శనివారం బోనాలు అన్నదాన కార్యక్రమం ఉంటుందని భక్తులు మత్స్యకారుల నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు విజయవంతం చేయాలని నిర్వాహకులు స్థానిక సర్పంచ్ హనుమంతు తెలిపారు