శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

మల్దకల్ ఆగస్టు 18 (జనంసాక్షి) మల్దకల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలోసర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370 జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు.ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి,సూపరిండెంట్ పెద్ద నరసన్న, మండల కో ఆప్షన్ నెంబర్ హైదర్ సాబ్, టిఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు,ప్రభాకర్, సిబ్బంది రెహమాన్, ప్రణీత, శీను,తదితరులు పాల్గొన్నారు.