Wednesday, 4 November 2026

షాపింగ్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి భూమి పూజ

 జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని చాకలి ఐలమ్మ సమీకృత కూరగాయల మార్కెట్లో నూతన దుకాణ సముదాయ భవనానికి శుక్రవారం మంథని మున్సిపల్ చైర్పర్సన్ కొత్త శైలజ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్లు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అనంతరం మంథని పట్టణంలోని బొక్కల వాగు కట్టపై సుందరీకరణలో భాగంగా జరుగుతున్న అభివృద్ది పనులను మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ పరిశీలించారు.