షీ టీమ్స్, సైబర్ నేరాల పై అవగాహన సదస్సు

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్. సూర్యాపేట జిల్లా ఎస్పీ యస్ రాజేంద్ర ప్రసాద్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మరియు అడిషనల్ ఎస్పీ మేక నాగేశ్వరరావు, షీ టీమ్స్ ఇన్చార్జి సూర్యాపేట డిఎస్పి పరికే నాగభూషణం ఆధ్వర్యంలో కోదాడ డి.ఎస్.పి ప్రకాష్,హుజూర్నగర్ సిఐ రామలింగారెడ్డి సహకారంతో నేరేడుచర్ల ఎస్సై పి.పరమేష్ మండల కేంద్రంలోని శ్రీవాణి పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్, స్పందన జూనియర్ కాలేజ్, విద్యార్థినీ విద్యార్థులకు షీ టీమ్స్, సైబర్ నేరాల పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా మహిళలు,పిల్లల భద్రత గురించి,పోలీస్ కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.పోలీస్ కళాబృందం చేత షీ టీమ్స్, మహిళల భద్రత రక్షణ,100 డైల్ గురించి,సోషల్ మీడియా, ఓటిపి ఫ్రాడ్స్, సైబర్ నేరాల గురించి, భరోసా సెంటర్ గురించి,టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి,సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాల గురించి, విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆట,పాటల ద్వారా పాఠశాల విద్యార్థి, విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి నేరేడుచర్ల ఎస్సై పి పరమేష్, సూర్యాపేట షీ టీం హెడ్ కానిస్టేబుల్ జాఫర్, భరోసా సెంటర్ మౌనిక, కిరణ్మయి, పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ రవీందర్, శ్రీవాణి హై స్కూల్ ప్రిన్సిపల్ సీతారాం రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ రవి, స్పందన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రవీణ్ రెడ్డి,పోలీస్ కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య,చారి, కృష్ణ,నాగార్జున, విద్యార్థి, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.