బెల్లంపల్లి,మే25(జనంసాక్షి): బెల్లంపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నెన్నల మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన వి.రాజుకు 60,000/ రూపాయల సియం రిలీఫ్ ఫండ్ ను అందచేసారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందున్నదని దుర్గం చిన్నయ్య అన్నారు. అన్నివర్గాలకు మేలు చేసే కార్యక్రమానలు సిఎం కెసిఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో కాంగ్రెస్ ఉనికిని కోల్పోతుందనే భయంతో ఆందోళనలు, ధర్నాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోరే వారెవరైనా ఇలాంటి పనికిమాలిన పనులు చేయరని, వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారనీ, తగిన సమయంలో వారే సమాధానం చెబుతారని పేర్కొన్నారు. 70ఏళ్లు కేంద్ర, రాష్ట్రాల్లో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడు కూడా రాష్ట్రంలో పండించిన పంటకు బోనస్, గిట్టుబాటు ధర ప్రకటించలేదన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎవరూ ఊహించని విధంగా పథకాలను ప్రవేశపెట్టడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు గోదాముల నిర్మాణం చేపట్టామన్నారు. ఐకేపీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించడానికి ప్రతి గ్రామంలో స్థలాన్ని సేకరిస్తున్నామని తెలిపారు.




