Monday, 2 November 2026

సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

మల్కాజిగిరి.జనంసాక్షి.జూన్1.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.గురువారం ఆనంద్ బాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్వాల్,మల్కాజిగిరి మండలాలకు చెందిన 372 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.అనంతరం 58,59 జీవో లో దరఖాస్తు చేసుకున్న 15 మందికి పట్టాలను అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్ జితేంద్రనాథ్,సబిత కిషోర్ గౌడ్,ప్రేమ్ కుమార్,రాజ్యలక్ష్మి ఎమ్మార్వో వెంకటేశ్వర్లు,అల్వాల్ డిప్యూటీ ఎమ్మార్వో రేణుక ఆర్ఐ రమేష్,వినీత శ్రీశైలం,ఆన్సర్,యాదగిరి సతీష్ కుమార్ పిట్ల శ్రీనివాస్,రాము యాదవ్,గూండా నిరంజన్,సంతోష్ రాందాస్,సురేష్,సత్తయ్య,బాబు, సత్యనారాయణ,ఆగమయ్య తదితరులు పాల్గొన్నారు.