సంతోషిమాత జయంతి వేడుకలకు మంత్రికి ఆహ్వానం
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): ఈనెల 12న శుక్రవారం రాఖీ పూర్ణిమ సంతోషిమాత అమ్మవారి జయంతి వేడుకల సందర్భంగా సతిసమేతంగా పూజల్లో పాల్గొనాలని కోరుతూ ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి సంతోషిమాత దేవాలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు.మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో దేవాలయ అధ్యక్ష , కార్యదర్శులు నూక వెంకటేశం గుప్త, బ్రహ్మాండ్లపల్లి మురళీధర్, ఉపాధ్యక్షులు నరేంద్రుని విద్యాసాగర్ రావు , కమిటీ సభ్యులు గోపారపు రాజు తదితరులున్నారు.