Tuesday, 3 November 2026

సకాలంలో మెట్రో పనులు పూర్తి

ruab7adaసకాలంలో మెట్రోరైలు పనులు పూర్తి చేస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నాగోల్- మెట్టగూడ మధ్య రైలును ప్రారంభిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదనే నివేదికలు వచ్చాయని అన్నారు. దీని వల్లే రైలును ప్రారంభించకుండా నిలిపివేశామని ఆయన అన్నారు. మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు 42 కిలోమీటర్ల మేర పిల్లర్లు వేశామని, 8 ఆర్ఓబీలు నిర్మించామని అన్నారు. 200 కిలోమీటర్ల మేర పనులను పొడిగించాలని సీఎం కేసీఆర్ కోరారని, ఈ మేరకు చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో పనులు పూర్తై ప్రజలకు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *