సికింద్రాబాద్ : సదరన్ రైల్వే, ఎంఎంటీఎస్ సమయపట్టికను దక్షిణ మధ్య రైల్వే జీఎం పాండే శనివారం రైల్ నిలయంలో విడుదల చేశారు. జులై 1 నుంచి దక్షిణమధ్య రైల్వే పరిధిలో నడిచే ఎనిమిది రైళ్ల సర్వీసులను పొడిగించారు. జులై 1నుంచి 10 రైళ్ల వేగం కూడా పెంచారు. అలాగే 25 రైళ్ల గమ్యస్థానాలు పొడిగిస్తామని, 25 కొత్త రైళ్లను ప్రవేశపెడతామని ఈ సందర్భంగా పాండే వెల్లడించారు.




