గుంటూరు :జులై 18న కృష్ణా, పశ్చిమ డెల్టాకు నీరు విడుదల చేసేందుకు జిల్లా నీటిపారుదల సలహా మండలి నిర్ణయించింది. ఈ మేరకు శనివారం జరిగిన సమావేశంలో తీర్మానించింది. అగస్టు 1న నాగార్జునసాగర్ కుడికాలువకు, అగస్టు 2న గుంటూరు ఛానల్‌కు నీటిని విడుదల చేయనున్నారు. అధునీకరణ పనులు జరుగుతున్నచోట కాలువ మరమ్మతు పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు మండలి సభ్యులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నీటి విడుదలపై కృష్ణా, గుంటూరు జిల్లాల ఎస్‌ఈలతో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు.




