Wednesday, 4 November 2026

సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

-సధర్ నిర్వాహకులు పిల్లి రాజు యాదవ్.

కూకట్ పల్లి, జనంసాక్షి అక్టోబర్ 22:

స్థానిక నియోజకవర్గం, కైతలపూర్ నందు ఈనెల 26వ తేదీన సదర్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని కైతలపూర్ సధర్ ఉత్సవ నిర్వాహకులు పిల్లి రాజు యాదవ్ తెలిపారు. శనివారం ఓ సమావేశంలో కైతలపూర్ సధర్ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతీయేట సధర్ ఉత్సవాలను జరుపుకొనుట ఆనవాయితీగా వస్తుందని,ఈసారి దీపావళి పండుగ తరువాత బుధవారంనాడు జరిగే సధర్ ఉత్సవాలలో స్థానిక ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో పిల్లి శ్రీశైలం యాదవ్ మహేష్ యాదవ్ జితేష్ యాదవ్, రాజు యాదవ్ మల్లేష్, సధర్ ఉత్సవ కమిటీ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.