సన్నాహక సభకు బయలుదేరిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు

బచ్చన్నపేట (జనం సాక్షి) జూన్ 21
జనగాం జిల్లా కేంద్రంలో జూబ్లీ గార్డెన్లో జరగబోయే జిల్లా సన్నాహక సభకు బచ్చన్నపేట ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ నాయకులు అధిక సంఖ్యలో తరలి వెళుతున్నట్లు ఎమ్మార్పీఎస్ బచ్చన్నపేట మండల ఇన్చార్జి అల్వాల నర్సింగరావు మండల కో ఇంచార్జ్ అల్వాల్ రాజు పాకాల కుమారస్వామి తెలిపారు. బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడుతూ .జాతీ భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయం తెలియజేయడం కోసం ప్రస్తుతం జరుగుతున్న పరిణాల వివరించడం కోసం జిల్లాలో ఉన్న మాదిగ మాదిగా ఉపకులాలు ఈ సన్నాహక సభకు అధిక సంఖ్యలో తరలివెళ్లడం జరుగుతుందని. ఒకవైపు వర్షాలు పడుతున్న ఇబ్బందులు ఉన్న పోరాట యోధుల్లాగా మ ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ నెరవేర్చుకోవడం కోసం మ శక్తిని మ బలని చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. బిజెపి అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తా అని చెప్పిన బిజెపి అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలవుతుంది అయినా వర్గీకరణ అంశం మాట్లాడకుండా నిరు కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ
వర్షాకాలం సమావేశంలోనే ఆమోద చేయించాలని లేని ఎడల కేంద్రంపై తాడో పేడో తేల్చుకునే విధంగా ఆగస్టు రెండో వారంలో హైదరాబాదులో విశ్వరూప మహాసభను పెట్టి మా సత్తాను చాటుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గంధమల్ల మల్లేష్ మాదిగ నల్ల అంజయ్య మాది గ అల్వాల అనిల్ మాదిగ వీహెచ్పీఎస్ మండల ఇన్చార్జి అల్వాల స్వామి మాదిగ ఎంఎస్ఎఫ్ నాయకులు ఆల్వాల్ రాజేష్ మాదిగ శ్రీకాంత్ మాదిగ బందరం చిరంజీవి తుడం రాజ్ కుమార్ కొల్లూరు సంపత్ కర్రె శ్రీనివాస్ గందమల్ల ఇస్తారు బాలరాజు నవీన్ తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు