సన్‌షైన్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ : మాదాపూర్‌లో సన్‌షైన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో అన్ని సదుపాయాలు కలిగిన హాస్పిటల్ సన్‌షైన్ అని తెలిపారు. 25 వేల అద్భుతమైన జాయింట్ రిప్లేస్‌మెంట్ ఆపరేషన్లు చేసిన ఘనత ఈ ఆస్పత్రి వైద్యులది అని కొనియాడారు. తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ ఆస్పత్రిని విస్తరించాలని సూచించారు. హెల్త్ హబ్‌గా హైదరాబాద్ మారుతున్న ఈ తరుణంలో సన్‌షైన్ ఆస్పత్రిని మరింత విస్తరించాలన్నారు.