సభాపతి చొరవతో బాన్సువాడకు ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజ్
రుద్రూర్ (జనంసాక్షి): తెలంగాణ వచ్చిన తర్వాత సభాపతి చొరవతో సీఎం కేసీఆర్ వలన బాన్సువాడకు నియోజకవర్గనికి జరిగిన అభివృద్ధి చాలానే ఉంది ముఖ్యంగా విద్య విషయంలో పట్టణలకు వెళ్లకుండా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేలా బాలికల నర్సింగ్ కాలేజ్, ఫుడ్ అండ్ సైన్స్ కాలేజ్ చెప్పొకోదగ్గవి , ఈ కోవలోనే బాన్సువాడ నియోజకవర్గనికి మైనార్టీ ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజ్ మంజూరు ఐనది ఈ విషయం తెలియగానే సులేమాన్ ఫారం ఖాదర్ , మరియు తెరాస మైనార్టీ ప్రెసిడెంట్ హాబీబ్, యూత్ లీడర్ అలీం ఖాన్, అహ్మద్, వార్డ్ మెంబెర్ గౌస్ బాన్సువాడ
పట్టణానికి వెళ్ళి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజ్ మంజూరు చేసినందుకు , శాలువా తో సన్మానించి , పుష్ప గుచ్చని అందించి ధన్యవాదాలు తెలిపారు , ఈ కార్యక్రమంలో తెరాస బాన్సువాడ నియోజకవర్గ ఇంఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, బాన్సువాడ
పట్టణ నాయకులు, తదితరులు ఉన్నారు