Tuesday, 3 November 2026

సభ్యుల సస్పెన్షన్ అప్రజాస్వామిక చర్య : జానారెడ్డి

హైదరాబాద్ : రైతు సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడితే వారి సస్పెండ్ చేయడం అప్రజాస్వామిక చర్య అని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. సస్పెన్షన్ కు గురయి విపక్షాలు అన్ని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడాయి. ఈ సందర్భంగా జారెడ్డి మాట్లాడుతూ సభలో విపక్షాలు లేకుండా సభ అసెంబ్లీ చర్రితలో ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి భరోసా కల్పించలేకపోయిందని.. రైతుల పై స్పస్టమైన ప్రకటన చేయమంటే మార్షల్స్ తో మమ్మల్ని బలవంతంగా బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణ మాఫీ ఏకకాలంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు మాట్లడనివ్వకపోవడం దారుణం. సీఎం ఆలోచనా విధానానికి తార్కణం అని మండి పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *