సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాజయ్య, జిల్లా కలెక్టర్ శివ లింగయ్య

స్టేషన్ ఘన్పూర్ ,సెప్టెంబర్ 09, ( జనం సాక్షి ) : నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16 న 15 వేల మందితో నిర్వహించే సభాస్థలాన్ని ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ శివ లింగయ్య సభస్థలాన్ని వేర్వేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య, జిల్లా కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ఏర్పాట్లు దగ్గర ఉండి  పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఈ  కార్యక్రమంలో జెడ్పి స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ గట్టయ్య, సర్పంచ్ సురేష్, డిసిపి సీతారాం, ఏసీపీ రఘుచం దర్, డిఆర్డిఎ పిడి రామ్ రెడ్డి, తాహసిల్దార్ ఫుల్ సింగ్ చౌహాన్,సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై శ్రవణ్ కుమార్ సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Attachments area