సమగ్ర సమాచారం ఇవ్వండి
బిజెపి మండలాధ్యక్షుడు నగేష్
డోర్నకల్ ఆగస్టు 6 జనం సాక్షి
2014,15 ఫైనాన్స్లో విడుదలైన నిధులను మండల వ్యాప్తంగా వెచ్చించిన సమగ్ర సమాచారాన్ని కోరుతూ మండల వ్యవసాయ అధికారి పద్మజ,ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి సమాచార హక్కు దరఖాస్తులు బిజెపి నాయకులు అందజేశారు.సందర్భంగా మండలాధ్యక్షుడు బాసాని నాగేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశానుసారం మండలంలో 14,15 ఆర్థిక సంవత్సరం నుంచి జూన్ 2022 వరకు కేంద్ర ప్రభుత్వం చెల్లించిన నిధులతో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి,రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి వెచ్చించిన నిధులు,బకాయిలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇవ్వవలసిందిగా అధికారులను దరఖాస్తు ద్వారా అభ్యర్థించినట్లు తెలిపారు.ఆయన వెంట పట్టణ అధ్యక్షులు లాకాన్,జిల్లా దళిత మోర్చా సీనియర్ నాయకులు జయరాజ్,మండల ప్రధాన కార్యదర్శి ఉపేందర్,మండల ఉపాధ్యక్షు దేవీసింగ్ నాయక్, గిరిజన మోర్చా అధ్యక్షులు గణేష్ నాయక్, యువజన మోర్చా అధ్యక్షులు లాల్ సింగ్ నాయక్ తదితరులు ఉన్నారు