సమస్యలు పరిష్కరించెలా చూడాలనీ ధ్యానం.
– 47వ రోజు నిరవదిక సమ్మెలో
సీఎం చిత్రపటానికి వినతి పత్రం సమర్పించిన ఊరుకొండ వీఆర్ఏలు.
ఊరుకొండ, సెప్టెంబర్ 9 (జనం సాక్షి):
బహిరంగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలు, వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లు అమలయ్యేలా చూడాలని ఊరుకొండ మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ బీ.సత్తయ్య, వీఆర్ఏలందరూ కలిసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి చిత్రపటానికి వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం ఊరుకొండ మండల కేంద్రంలో వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 47వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా
రాష్ట్రంలో 27 మంది వీఆర్ఏలు చనిపోయిన సందర్భంగా వీఆర్ఏల డిమాండ్ల సాధనకు మనోధైర్యం ముఖ్యమని, దానికి ధ్యానం (శ్వాస మీద ధ్యాస) ఒక్కటి మార్గమని నిరవధిక సమ్మెలో ఊరుకొండ పేట గ్రామానికి చెందిన ధ్యాన గురువు చింతల మధుసూదన్ రెడ్డి సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ వీఆర్ఏలచే ధ్యానం చేయించారు. అనంతరం
వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ బీ.సత్తయ్య మాట్లాడుతూ.. వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని వాపోయారు. కార్యక్రమంలో ఊరుకొండ మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ బీ. సత్తయ్య, కో చైర్మన్ బీ.రమేష్ , జెర్నల్ సెక్రటరీ శేఖర్, కన్వినర్ డీ.శ్రీలత, కో కన్వినర్ లు సుల్తాన్. జంగయ్య, దశరథం. యాదయ్య, యాదమ్మ, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.