హైదరాబాద్: సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వానికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ చర్యలన్నీ తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.




