Wednesday, 4 November 2026

సమాజానికి మీ సేవలు అవసరం.

జూలై (జనంసాక్షి )
సమాజానికి మీ సేవలు అవసరమని మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము దేవేందర్ అన్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించుకుంటూ అమ్మానాన్నల కోసం అమ్మానాన్నల కోసం మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ విరాళం అందజేసి మీ దాతృత్వాన్ని చాటుకున్నారని అన్నారు. అమ్మానాన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని గ్రూప్ వన్ ఆఫీసర్ గా ఎదిగి అమ్మానాన్నలపట్ల మీకున్న ప్రేమానురాగాలతో వారి ఫోటోలతో ఆర్గనైజేషన్కు మీరు అందించిన సహాయం ఏ నలేనిది అన్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో అమ్మానాన్నలు అంటే పట్టించుకోని పిల్లలు ఉన్నారని చూశాం కానీ మీలాంటి ఆఫీసర్లు అందరికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాం ప్రభుత్వ ఉద్యోగి అనేక సవాళ్లు ఎదుర్కొంటూ తమదైన శైలిలో అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ మీసేవ వెలకట్టలేనిది అన్నారు. ఇలానే మునుముందు కార్యక్రమాలకు ఆపదలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందిస్తూ మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూకోరారు.
Attachments area