Tuesday, 3 November 2026

సమాజ సేవలో కొత్తపేటలయన్స్ క్లబ్ సేవలు అమోఘము

ఎల్బీనగర్ (జనం సాక్షి )  2014 లో ప్రారంభించిన లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ కొత్తపేట బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్న ప్రభుత్వానికి ఈ 8 సంవత్సరాలలో అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించిన క్లబ్ సభ్యులు .ఒక పక్క వైద్యం , విద్య ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కలిగిస్తూ హరితహారంలో భాగస్వామిగా ,ఆర్గాన్ డొనేషన్స్ ను ప్రోత్సహిస్తూ రక్త దాన శిబిరాలు ,ఆకలితో ఉన్నవారికి కొత్తగా మీల్స్ అన్ వీల్స్ అని ,వైకుంఠధామలకు చిన్న చిన్న గ్రామాలకు 75 డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులు అందించాము .అలాగే మహిళా దినోత్సవములకు ఉ త్తమ సేవ చేసే మహిళకు సన్మానించడము ,టీచర్స్ డే ,డాక్టర్ డే ,ఇంజనీర్స్ డే ఆలా  సమాజములో ప్రజలకు సేవ చేసేవారిని సన్మానిస్తూ ప్రతిఒక్కరు ప్రభుత్వాన్ని ఆశించకుండా తమకు వచ్చే ఆదాయములో కొంత మొత్తమును దానము చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక అంతర్జాతీయ లయన్స్ సేవ సంస్థ .  స్వయం ఉపాదికింద పేద  మహిళలకు ఉచితముగా టైలరింగ్  నేర్పిస్తారు.ఇందులో 200 వందల దేశాలలో విస్తరించి 45% కంటికి సంబంధించిన ఆపరేషన్స్ స్క్రీనింగ్ నిర్వహిస్తుంది .అనేక  కంటి ఆపరేషన్స్ ,స్క్రీనింగ్ ఉచితముగా పేదవారికి  నిర్వహిస్తుంది . అటువంటి సంస్థలో ఉత్తమ అధ్యక్షునిగా అవార్డు రావటానికి సహకరించిన మా క్లబ్ సభ్యులకు గుర్తించిన గవర్నర్ డాక్టర్ రామ కృష్ణ రెడ్డి కి  పేరు పేరున ధన్యవాదములు .గతములో లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ కొత్తపేట ఎల్బీ నగర్ నందు  ఆర్ కృష్ణయ్య తో ,తెరాస ఇంచార్జి  ముదగోని రామ్ మోహన్ గౌడ్ తో ,ఎమ్ఎల్సి బొగ్గారపు దయానంద్  , ఎల్బీ నగర్  ఎమ్ఎల్ఎ  దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, సర్దార్ పుటం పురుషోత్తం   ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారితో  మరియు స్థానిక  పోలీసు  , మెడికల్  ,  జిహెచ్ఎమ్సి అధికారులతో  కార్పొరేటర్  జిన్నారం విట్టల్ రెడ్డి తో పాల్గొని వారు కూడా మాకు సహకరించినందుకు అందరికి పేరు పేరున ధన్యవాదములు8   కొత్తపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ విజయ రంగ,   తెలిపారు .