హైదరాబాద్,మే2( జనం సాక్షి): సద్గురు రామానుజులు వెయ్యేళ్ల కిందటే సామాజిక సమానత్వాన్ని బోధించి సామాన్య ప్రజలకు భగవంతుడ్ని చేరువచేశారని ప్రముఖ వైష్ణవాచార్యులు అన్నారు. ఎల్బినగర్లో ఉన్న తెలంగాణ శ్రీవైష్ణవ సేవాసంఘం, మౌలాలి రామానుజ సేవాట్రస్టుల ఆధ్వర్యంలో శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి ఊరేగింపు ర్యాలీని నిర్వహించారు. కోలాటాలు, భజనలతో హృద్యంగా ఈ ర్యాలీ సాగింది. అనంతరం ధర్మసందేశాలు ఇచ్చారు. శ్రీరామానుజాచార్యులు సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. శ్రీరామానుజాచార్యుల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భగవంతునిపై పరిపూర్ణమైన విశ్వాసం, శరణాగతి భక్తితో కొలిస్తే మోక్షం తప్పక సిద్ధిస్తుందని, దీనికి వర్ణ, వర్గ, లింగభేదాలు లేవని శ్రీరామానుజాచార్యులు వెయ్యేళ్ల ముందే దశదిశలా చాటిచెప్పారని పేర్కొన్నారు.
సమానాత్వాన్ని బోధించిన రామానుజులు




