Thursday, 5 November 2026

సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలి

గద్వాల నడిగడ్డ, జూన్ 10 (జనం సాక్షి);ఈనెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించనున్న సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం (ఐడిఓసి) లో ఏర్పాట్లు సత్వరం పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
శనివారం ఐడిఓసి, ఎస్పీ నూతన భవనాలను మంత్రి పరిశీలించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. స్వాగత ఏర్పాట్లు, కలెక్టర్ ఛాంబర్, కాన్ఫరెన్స్ హాల్ ఇతర విభాగాలలో ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ఎస్పీ కార్యాలయాన్ని మంత్రి పరిశీలించి అక్కడి విభాగాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ సరిత, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి , జిల్లా ఎస్ పి సృజన , జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు.