Wednesday, 4 November 2026

సమ్మక్క గద్దెలను సందర్శించిన బెల్లంపల్లి ఏ.సీ.పీ.

సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర లో భాగంగా ఆర్కేపీ 1ఏ గని సమ్మక్క సారలమ్మ గద్దెల ను బెల్లంపల్లి ఏ.సీ.పీ. ఎడ్ల మహేష్ సందర్శించి, శాంతి భద్రతల దృష్ట్యా పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు జాతరలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని పేర్కొన్నారు. ఏ.సీ.పీ.వెంట మందమర్రి సీ.ఐ. ప్రమోద్ రావు, ఆర్కేపీ ఎస్.ఐ.సుధాకర్ లు ఉన్నారు.