సమ్మెను విరమించి విధులకు హాజరైన విఆర్ఎలు.
నెరడిగొంఅక్టోబర్13(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా ఇచ్చిన హామీలను వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ 80వ రోజు వరకు నిరవధిక సమ్మెలో మండల విఆర్ఏలు తమ డిమాండ్లు నెరవేరేవరకు ఉద్యమాన్ని విరమింప బోమని ప్రభుత్వానికి గట్టిగా తెలియజేశారు.ఇందులో భాగంగా ప్రభుత్వం దిగివచ్చి వీఆర్ఏల సమస్యలు పరిష్కరానికి కట్టుబడి ఉన్నామని ఇచ్చిన హామిమేరకు సమ్మె ను విరమించుకొని మండల తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేసి విధులకు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో విఆర్ ఎలు పాల్గొన్నారు.