సరబ్‌జిత్‌ను పాకిస్థాన్‌ ప్రభుత్వం హత్యచేసింది: సోదరి దల్బీర్‌సింగ్‌

ఢిల్లీ : సరబ్‌జిత్‌ను పాకిస్థాన్‌ ప్రభుత్వం హత్య చేసిందని ఆయన సోదరి దల్బీర్‌సింగ్‌ అరోపించారు. ఆయన మృతి తమ కుటుంబానికి తీరని లోటని ఆమె పేర్కొన్నారు. నిర్దోషికి ఎప్పుడూ శిక్ష పడదని, హత్య మాత్రమే జరుగుతుందని ఆమె ఆవేదనతో అన్నారు. సరబ్‌జిత్‌ ముందే చనిపోయాడని, కానీ వైద్యులు తమకు చెప్పకుండా దాచిపెట్టారని దల్బీర్‌ ఆరోపించారు. భారత ప్రజల పట్ల పాకిస్థాన్‌ వైఖరి మొదటినుంచి అభ్యంతరకరమేనని అమె అన్నారు. అమాయకుడిని బలి తీసుకున్న పాకిస్థాన్‌ ఎప్పటికీ మారదన్నారు. భారత ప్రభుత్వం సకాలంలో స్పందించివుంటే సరబ్‌జిత్‌ మరణించి ఉండేవాడు కాడని, 2005 నుంచి తాము చేస్తున్న అభ్యర్థనలను ప్రభుత్వాలు పట్టించుకుని ఉంటే సరబ్‌జిత్‌ హత్య జరిగి వుండేది కాదని దల్బీర్‌ అరోపించారు. సరబ్‌హత్యకు నిరసనగా భారతదేశం ఒక్కతాటిపై నిలబడాలని, పాకిస్థాన్‌ అకృత్యాలపై కులమతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు స్పందించాలని  ఆమె కోరారు.