Tuesday, 3 November 2026

సర్కారు స్కూళ్లలో బయోమెట్రిక్‌

హైదరాబాద్‌,జ‌నంసాక్షి): ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. తెలంగాణ ప్రభుత్వం వసతుల కల్పనతోపాటు విద్యార్థి సంక్షేమానికి పాటుపడుతోంది. దీనికితోడుగా కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా యోచిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర మానవ వనరులశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఐదు వేల పాఠశాలల్లో బయోమెట్రిక్‌ హాజరును అమలు చేసేందుకు సంకల్పించారు. 6 నుంచి 10వ తరగతి బోధించే పాఠశాలల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. ఒక్కో పాఠశాలలో ఒక్కో బయోమెట్రిక్‌ మిషన్‌ ఏర్పాటు చేయడం వల్ల జిల్లాలో పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు, విద్యార్థుల సమయపాలన పక్కాగా అమలవుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో సకాలంలో బడికి రాని ఉపాధ్యాయులు, విద్యార్థుల వల్ల విద్యాప్రమాణాలు కుంటుబడుతున్నాయి. వైఫల్యాన్ని గుర్తించడంలో ఇన్నాళ్లు అధికారులు విఫలమాయ్యరు. త్వరలో అమలు చేసే విధానం వల్ల పారదర్శకత పెరుగనుంది. గతంలోనే ఈ పక్రియను అమలు చేయాలని విద్యాశాఖ అధికారులు భావించారు. ఇందులో భాగంగానే కొన్ని మారుమూల ప్రాంతాల్లో పరికరాలను అమర్చారు. వాటి వినియోగంలో లోపాలు కనిపిస్తున్నాయి.
దీనిని అరికట్టి వచ్చే విద్యాసంవత్సరం నాటికి దీనిని అమలు చేస్తారు.
………………………………..