మంగళగిరిలో విషాదం..
లక్ష్మీనారాయణ తన ఇద్దరు పిల్లలు పురుగుల మందు తాగి ఆత్మహత్య
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో విషాదం నెలకొంది. పట్టణంలోని కొప్పురావుకాలనీ 11వ లైన్‌లో నివాసం ఉంటున్న తిరువీధుల లక్ష్మీనారాయణ అతని కుమారులు తేజేశ్వర్, అమరేశ్వర్ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. లక్ష్మీనారాయణ భార్య శిరీష మార్చి నెలలో అనారోగ్యంతో మృతి చెందింది. ఆ భాధను తట్టుకోలేకే వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. తాము చనిపోతున్నట్లు తెల్లవారు జామున లక్ష్మీనారాయణ బంధువులు, స్నేహితులకు చరవాణి ద్వారా సందేశం పంపారు. దానిని అమెరికాలో ఉన్న ఓ వ్యక్తి చూసి వెంటనే లక్ష్మీనారాయణ తండ్రికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టే సరికే ముగ్గురూ విగత జీవులుగా పడి ఉన్నారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటనతో కొప్పురావు కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.