హైదరాబాద్,మార్చి26 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం రాబింగ్ హుడ్‌లా వ్యవహరిస్తోందని ఆళ్లగడ్డ వైకాపాఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వ్యాఖ్యానించారు. ధరలు పెంచుతూ నడ్డి విరుస్తోందన్నారు. గురువారం ఆమె అసెంబ్లీలో డీజిల్, పెట్రోల్ ధరల పెంపుపై మాట్లాడారు. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు నుంచి రైతులు వరకూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా రాబిన్ హుడ్ ఉదంతాన్నిను అఖిలప్రియ సభలో ప్రస్తావించారు. రాబిన్ హుడ్ ధనవంతులను దోచుకొని…ఆ సంపదను పేదలకు పంచితే… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పేదలను దోచుకుని… ఆ సందపను సంపన్నులకు పెడుతోందని అన్నారు. సర్కార్ రాబింగ్ హుడ్ అని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. ఓవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే…మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం సరికాదన్నారు. రైతులు ట్రాన్స్పోర్టు ఖర్చులను భరించలేకపోతున్నారు. ఆంధప్రదేశ్కు రావాల్సిన నిధులకు సంబంధించి అధికార, ప్రతిపక్షంతో పాటు స్పీకర్ సహా …కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకుందామని అఖిలప్రియ కోరారు.
సర్కార్‌ది రాబింగ్‌హుడ్ పాత్ర: అఖిలప్రియ




