Wednesday, 4 November 2026

సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కు ఘన నివాళులు

తెలంగాణ తొలి రాజు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు దొరల అరాచకాలను మొగలాయిల దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన గౌడ జాతి ముందు బిడ్డ సర్దార్ శ్రీశ్రీశ్రీ సర్వాయి పాపన్న గౌడ్ కు ప్రతి ఒక్కరూ నివాళులర్పించాల్సిన అవసరం ఉందని ముఖ్య అతిథి శామీర్ పేట ఎంపీపీ దాసరి ఎల్లుబాయి అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రం శామీర్ పేట రాజీవ్ రహదారి వైఎస్ చౌరస్తా వద్ద 372 వ జయంతిని పురస్కరించుకొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దొరల రాజ్యంలో బానిస బతుకులు బతుకుతున్న బడుగు బలహీన వర్గాల కు స్వేచ్ఛ స్వాతంత్రాలను కలిగించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి శామీర్ పేట మండల మాజీ ఎంపీపీ పల్లె సీతారాములు గౌడ్, మజీద్ పూర్ ఎంపీటీసీ సభ్యుడు అశోక్ రెడ్డి, కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు మేడి భాస్కర్, వార్డు సభ్యులు శ్రీకాంత్ గౌడ్, నవీన్ ముదిరాజ్, రవీందర్, కెసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ అఫ్జల్ ఖాన్, కార్మిక సేవా సమితి బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు శంకర్ గౌడ్, జిల్లా నాయకులు ఎం.మహేందర్ యాదవ్ , టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు దేశం శ్రీకాంత్ గౌడ్, బిజెపి మండల కార్యదర్శి సాయినాథ్ గౌడ్, గ్రామ శాఖ బిజెపి అధ్యక్షులు బోయిని రాజు, బోయిని రఘు శివ అజీమ్, నిసార్ అహ్మద్, టిఆర్ఎస్ నాయకులు వంగ వెంకటరెడ్డి, గాజుల సత్యనారాయణ ముదిరాజ్, తుంకి బిక్షపతి, గౌడ సంఘం సభ్యులు బత్తిని కృష్ణ గౌడ్, వెంకటేష్ గౌడ్ ఆంజనేయులు గౌడ్, బాలకృష్ణ గౌడ్, నరేష్ గౌడ్, సత్యసాయి గౌడ్, శోభన్ గౌడ్, వెంకటేష్ శేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

18ఎస్పీటీ -3:నివాళులు అర్పిస్తున్న నాయకులు