Wednesday, 4 November 2026

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి

ఆళ్లపల్లి ఆగస్టు 17 (జనం సాక్షి)
బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆళ్లపల్లి మండల ఏజెన్సీ గౌడ సంఘ నాయకులు బత్తిని వెంకటేష్, శ్రీరామ్ సమ్మయ్య, తాళ్లపల్లి వెంకన్న యాసర బాబు తెలగాని పురుషోత్తం ,రేసు తిరుమలేష్ వగలబోయిన అశోక్ తాళ్లపల్లి శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు తెలిపిన ప్రకటనలో ఆళ్లపల్లి సమండల కేంద్రంలో రైతు వేదికలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ మాట్లాడుతూ … ప్రభుత్వం అధికారికంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు 350 ఏళ్ల క్రితం క మొగల్ పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాటం చేసి బహుజన నాయకుడు సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. మొగల్ చక్రవర్తిని గడగడలాడించిన వీరుడు అని ,గోల్కొండ ఖిలాపై విజయ పతాకన్ని ఎగరు వేయడమే లక్ష్యంగా పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు .మొగల్ చక్రవర్తి దౌర్జన్యాలు అడ్డు అదుపు లేకుండా సాగాయి. పేద సామాన్య ప్రజల నుంచి విపరీతంగా పన్నులు వసూలు చేయడం చూసి మొగల్ చక్రవర్తి పై తిరగబడ్డ వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. అంతటి మహా గొప్ప వీరుడు చరిత్ర ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని నేడు జరగబోయే సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఆళ్లపల్లి మండల ఏజెన్సీ గౌడ సంఘం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు