సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
మోత్కూరు ఆగస్టు 18 జనంసాక్షి : తెలంగాణ తొలి బహుజన విప్లవవీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం నాడు మోత్కూరు లో బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ 372 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి నియోజకవర్గ ఇంచార్జి అనంతుల దేవాంజి, పట్టణ అధ్యక్షుడు నిలిగొండ మత్స్య గిరి, మున్సిపల్ కో-అప్షన్ సభ్యులు గనగాని నర్సింహ్మ, మాజీ సర్పంచులు సూదగాని పాండు, తండు సత్తయ్య, గడ్డమీది రమేష్, కారుపోతుల శ్రీను, బీసు యాదగిరి,కోల శ్రీను తదితరులు పాల్గొన్నారు.