*సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి.

* బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ గౌడ్.
చిట్యాల14(జనంసాక్షి)సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా  నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ 372 సంవత్సరాల క్రితమే మొగల్ సామ్రాజ్యంపై దండెత్తి బహుజనుల రాజ్యాధికారానికి పునాదులు వేశారని, గోల్కొండ కోటపై బహుజనుల జెండాను ఎగురవేసిన బహుజనుల తొలి చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఆ మహనీయుని చరిత్రను నేటి తరాలకు అందించి.. ఆ మహనీయుడి స్పూర్తితో బహుజనులందరూ ఏకమై రాజ్యాధికారం కోసం ఉద్యమించి గోల్కొండ కోట పై బహుజనుల జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
 

తాజావార్తలు