సర్వేలన్నీ శ్రీనివాస్ గౌడ్ కే అనుకూలం బిజెపి నాయకులు పాలకూరి రవి గౌడ్
నల్గొండటౌన్, నవంబర్ 20(జనంసాక్షి)
నల్గొండ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆరు దశాబ్దాల ఆశా కిరణం మాదగాని శ్రీనివాస్ గౌడ్ గెలుపును కోరుతూ నలగొండ నియోజకవర్గ ప్రజలు తమ అభిప్రాయాలను వివిధ సర్వేలను బట్టి చూస్తే ఇవాళ ఏ సర్వే చూసినా కూడా నల్లగొండ నియోజక వర్గంలో బిజెపి పార్టీ అభ్యర్థి మాధగాని శ్రీనివాస్ గౌడ్ కు గెలుపుకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మిత్రులారా మనందరం బడుగు బలహీన వర్గాల ప్రజలం ఏకతాటి మీదికి వచ్చి మాదగాని శ్రీనివాస్ గౌడ్ గెలుపు కోసం ఈ పది రోజులు అహర్నిశలు కష్టపడాలని ప్రతి ఒక్కరిని మనస్పూర్తిగా వేడుకుంటున్నా బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్ అన్నారు.