– సీబీఐ ముందు కేవీపీ వాంగ్మూలం ఇదీ
– జగన్ ఎప్పుడూ ఏమీ అడగలేదని వెల్లడి
హైదరాబాద్ : జగన్ అక్రమ ఆస్తుల వ్యవహారంలో తన ఒత్తిడి గానీ,ప్రమేయం గానీ లేవని వైఎస్ ఆత్మబంధువు కేవీపీ రామచంద్రరావు సీబీఐ ముందు విస్పష్టంగా తెలిపారు. శనివారం సీబీఐ ఆయన్ను సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే.తాను ప్రభుత్వ సలహాదారుగా పనిచేశానని, ఏదైనా అంశంపై సలహాలు,సూచన కావాల్సి వచినప్పుడే ఆసమావేశానికి పిలిచేవారని,తనకు సముచితమని తోచిన విషయాన్నే చప్పేవాడినని తెలిపారు.
పలు రికార్డుల్ని, ఫైళ్లను ముందుంచి ఈ ఫైలు రూపోందండంలో మీ పాత్ర ఎంత వరకు ఉంది? దీనిద్వారా కోంతమంది భారీ ప్రయోజనాలు పోందారు.దీనికి మీరేం చెబుతారు,అంటూ సీబీఐ ఆయనపై ప్రశ్నలు సంధించింది అడిగినప్పుడు సలహా చెప్పడం తప్ప,తర్వాత దానిపై ఏ నిర్ణయం తీసుకున్నారో ఆసలహా అసలు అమలైందో లేదో తానెప్పుడూ పట్టించుకోలేదని కేవీపీ స్పష్టం చేశారు. తానెప్పుడూ ప్రభుత్వ దైనందిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని, ఫైళ్లు చూడటం గానీ, నడపడం కానీ చేయలేదని పేర్కోన్నారు.
ఆఫైళ్ల వల్ల ఎవరికి ఎలాంటి మేలు జరిగిందో తనకు తెలియదని, తనకు మాత్రం ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని స్పష్టం చేశారు. తను రాజశేఖర రెడ్డికి సన్నిహితుడినే అయినా మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నానని, వైఎస్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పుడు కూడా తాను కాంగ్రెస్‌లోనే కోనసాగానని చెప్పినట్లు తెలిసింది. జగన్ తనను ఎప్పుడూ ఏదీ అడగలేదని,తన ద్వారా ఎలాంటి ప్రయోజనం పోందలేదని చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించి ఏఫైళ్లు చడలేదు. చడను కూడా. ఎక్కడా నా పేరుతో లావాదేవీలు, సంతకాలు ఉండవు,అడిగితే సలహాచెప్పడం,తర్వాత ఆ అంశాన్ని ముగించడం నాకు అలవాటు.
ఇక ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డిని ఎప్పుడెప్పుడు ఎవరెవరు కలిశారో పట్టించుకోలేదు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ లో ఉన్నాను కాబట్టి చాలా మంది నేతలు వచ్చి నన్ను కూడా కలిసి ప్రయోజనాలు అందలేదు అని కేవీపీ పేర్కోన్నారు. అయితే,ఇంకా పలు అంశాలకు సంబంధించి వివరాలు కావాల్సి ఉన్నందున అందుబాటులో ఉండాలని సీబీఐ ఆయన్ను కోరింది. తను కోద్ది రోజులపాటు అమెరికా వెళ్లాల్సి ఉంటుందని కేవీపీ చెప్పగా, వెళ్లిరావోచ్చని సీబీఐ అధికారులు బదులిచ్చారు.




