Wednesday, 4 November 2026

‘సహకారం’పై నేడు పరిశీలకులతో బొత్స భేటీ

హైదరాబాద్‌: సహకార ఎన్నికలకు పార్టీ పరంగా నియమితులైన పార్టీ పరిశీలకులతో గురువారం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాణ భేటీ కానున్నారు. ఆయా జిల్లాల్లో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలకులు బొత్స దృష్టికి తీసుకురానున్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్‌దే ఆధిక్యం అయినప్పటికి పార్టీ పరంగా చాలా మంది నాయకులు ‘ చేయి’ ఇచ్చారనే ఫిర్యాదులు పార్టీకి అందుతున్నాయి. ఈ విషయమై ఖమ్మం, తదితర జిల్లాల్లోని నేతలు నేరుగా పీసీసీ అధ్యక్షుడిని కలిసి వెళ్లారు. పార్టీ పరిశీలకులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో గురువారం నాటి సమావేశానికి ప్రాధాన్యం చేకూరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *