నియామకాలపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్,జూలై10(జనం సాక్షి ): తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్‌కు హైకోర్టు షాకిచ్చింది. సాంస్కృతిక శాఖలో నియామకాలు పారదర్శకంగా లేవన్న హైకోర్టు వ్యాఖ్యానించింది. మళ్లీ నియామకాలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. సాంస్కృతిక శాఖలో నియామకాలపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు సాంస్కృతిక శాఖలో నియామకాలు పారదర్శకంగా లేవని తెలిపింది. 2 వారాల్లో నోటిఫికేషన్ విడుదల చేసి.. 3 వారాల్లో నియామకాలు చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.




