– 60ఏళ్లు పాలించి కాల్వ పక్కన రైతులకు నీళ్లివ్వలేక పోయారు
– విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, జులై28(జనం సాక్షి): సాగర్ చివరి ఆయకట్టు వరకు నీళ్లించి పంటపొలాలను పచ్చగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని రాజన్నగూడెంకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 150 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ ఇంచార్జీ నోముల నర్సింహులు ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో వీరంతా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మంత్రి జగదీశ్‌రెడ్డి.. గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల నుంచి టీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి.. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. గతంలో సాగర్ ఎడమ కాల్వకు నీళ్లు ఇవ్వలేదు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక టెల్‌ఎండ్ వరకు నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు. సాగర్ కింద చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. కాంగ్రెస్ 60 ఏళ్లు పాలించి.. కనీసం కాలువ పక్కన ఉన్న రైతులకు నీళ్లు ఇవ్వలేదని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ఇప్పటికే రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచారని అన్నారు. పెట్టుబడి పథకం కింద రైతులకు ఎకరాకు 8వేలు, రైతుబీమా, సమన్వయ సమితుల ఏర్పాటు ఇలా అన్ని విధాలుగా రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చేలా కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణ రైతును దేశానికే ఆదర్శంగా నిలిపేలా కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్‌కు అండగా ఉంది తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దటంలో కలిసి రావాలని మంత్రి పిలుపునిచ్చారు.




