Saturday, 7 November 2026

సామాజిక దృక్పథంతో రోటరీ సేవా కార్యక్రమాలు : అధ్యక్షులు బాపురెడ్డి

:శామీర్ పేట్, జనం సాక్షి : శామీర్ పేట్
కట్ట మైసమ్మ వద్ద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ను సామాజిక సేవ దృక్పథంతోనే రోటరీ క్లబ్ పనిచేస్తున్నదని రోటరీ క్లబ్ గజ్వేల్ అధ్యక్షుడు ఏనుగు బాపురెడ్డి అన్నారు. శుక్రవారం షామీర్పేటలోని కట్ట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రోటరీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదన్నారు. అనాధలు, పేదలు, వృద్ధులు అనే తేడా లేకుండా వారి శ్రేయస్సుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ అసిస్టెంట్ గవర్నర్ కరుణాకర్ రెడ్డి, గ్రామీణ వికాస్ యోజన చైర్మన్ చంటి, కార్యదర్శి బాబుగౌడ్, కోశాధికారి నర్సింహారెడ్డి, పూర్వ అధ్యక్షుడు జగదీశ్వర్, సభ్యులు వంగా వెంకటరెడ్డి, తదితరులు
పాల్గొన్నారు.
23ఎస్పీటీ -1: దుప్పట్లు పంపిణి చేస్తున్న దృశ్యం