Wednesday, 4 November 2026

సాయంలో మంత్రుల ఉదారత

హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): కేరళ వరద బాధితులను ఆదుకోవాలన్న ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పిలుపుతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, సామాన్యులు ముందుకొస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కేపీ వివేకానంద్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు తమ ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ రూ.5 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు. నల్లగొండజిల్లా మునుగోడుకు చెందిన టీఆర్‌ఎస్‌ నేత కర్నాటి విద్యాసాగర్‌ సీఎం సహాయనిధికి రూ.లక్ష విరాళం ప్రకటించారు. సంబంధిత చెక్కు మంత్రి కేటీఆర్‌కు సోమవారం ప్రగతిభవన్‌లో అందజేశారు.