.భువనగిరి టౌన్ జనం సాక్షి శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రాంగణంలో ఘనంగా డిగ్రీ విద్యార్ధుల వీడ్కోలు కార్యక్రమంఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల చైర్మన్ శ్రీ దరిపల్లి నవీన్ కుమార్ మరియు కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ ఫౌండర్ స్వర్గీయ శ్రీ దరిపల్లి అనంత రాములు చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ విద్యార్థులు వారి యొక్క ఈ మూడు సంవత్సరాల కాలం మాకు ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయని కాలేజీ నుంచి వెళ్లాలంటే ఎంతో బాధగా ఉందని కాలేజీ విడిపోతునందుకు కాలేజీ పేరు ప్రతిష్టలు కాపాడే విధంగా మీరు చూపిన దారిలో మేము లైఫ్ లో మంచిగా సెటిల్ అవుతామని అంటూ విద్యార్దులు వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల చైర్మన్ నవీన్ కుమార్ గారు మాట్లాడుతూ మీ లక్ష్యసాధనలో మీరు విజయం సాధించాలని అన్నారు. విద్యార్థులు మీ తల్లిదండ్రులకు మీ ఊరికి పేరు తీసుకువచ్చి వారి కళ్ళల్లో ఆనందభాష్పాలు చిగురించేలా చేయాలని అన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మా శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులకు కోర్సు పూర్తి చేసిన వెంటనే 100% ఉద్యోగాల కల్పనే ద్యేయంగ కృషి చేస్తున్నామని ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ లో ఉద్యోగం వచ్చే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నామని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా లైఫ్ లో సెట్ అవ్వాలని కోరారు. శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ యాకుబ్ బాబా మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని ఈ దశలో పిల్లలు సఫలీకృతులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాము, అధ్యాపకులు కొలను శ్రావణ రెడ్డి, భిక్షపతి,మహేందర్, వోగ్గు ఉషారాణి,సమీర్,దీపిక, రత్నపురం శ్రీనివాస్, పరశురాములు,వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సురేష్ గారు, వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ జిలకర సురేష్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అర్జున్, లావణ్య, బివి రెడ్డి, రేఖ, నాగ మల్లేష్, శ్రీనివాస్, కళ్యాణ్, నాగేశ్వరరావు, భవాని జ్యోతి, హెచ్ అండ్ ఎస్ డిపార్ట్మెంట్ వెంకటేశ్వర్లు వాత్సల్య నాన్ టెస్టింగ్ స్టాప్ గోపాలకృష్ణ విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క ఆటపాటలతో రోజంతా ఎంతో సంతోషంగా గడిపారు.




