నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,మార్చి10(జనంసాక్షి):
మహిళలకు సావిత్రిబాయి ఫూలే మహిళా ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు దిక్సూచి అని డిఈఓ గోవిందరాజులు అన్నారు.
డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగస్తులను ఆయన శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….మహిళలు చదువుకుంటేనే అరాచకాలు రూపుమాపొచ్చన్న ఉద్దేశంతో జ్యోతిభా ఫూలే తన భార్య సావిత్రిబాయిఫూలేను మొదటి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారని డిఈవో గుర్తు చేశారు. మహిళలు చదువుకుంటే కుటుంబం ఉన్నతస్థాయికి చేరుకుంటుందన్నారు. ఆమె స్ఫూర్తితోనే అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారన్నారు. సావిత్రిబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకొని అమ్మాయిల విద్యకు అధిక ప్రాధాన్యత ఇయ్యాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.నేడు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే సాధించిన విజయాలను గుర్తుచేసుకొని ఆశయ ను కొనసాగించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగస్తులు బాలిక విద్యాభివృద్ధి అధికారిని సూర్య చైతన్య, సీనియర్ అసిస్టెంట్ శైలజ, జూనియర్ అసిస్టెంట్ మౌనిక, సి ఆర్ పి ప్రేమలత, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు.




