హైదరాబాద్,జూలై24(జనంసాక్షి): ప్రముఖ సాహితీవేత్త నిర్మలానంద(84) మంగళవారం కన్నుమూశారు.
35 ఏళ్లుగా జనసాహితి సాహిత్యోద్యమంలో నిర్మలానంద కీలకపాత్ర పోషించారు. హిందీసహా పలు భారతీయ భాషల నుంచి వందలాది కథలను తెలుగులోకి అనువదించారు. అలాగే శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని నిర్మలానంద హిందీలోకి అనువదించారు. రేపు(బుధవారం) ఉదయం 11.30గంటలకు హైదరాబాద్లో నిర్మలానంద అంత్యక్రియలు జరుగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిర్మలానంద మృతి పట్ల జనసాహితి నేతలు కొత్తపల్లి రవిబాబు, దివికుమార్, అరుణ సంతాపం ప్రకటించారు.




