సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
(ప్రభుత్వ రంగ సంస్థ)ప్రజా సంబంధాల విభాగం, జియం కార్యాలయం, ఇల్లందు ఏరియా
ఘనంగా కోయగూడెం ఉపరితల గనిలో 53 వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు
టేకులపల్లి, అక్టోబర్ 17( జనం సాక్షి): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ఇల్లందు ఏరియా ఆధ్వర్యంలో కోయగూడెం ఉపరితల గని లో 53వ వార్షిక రక్షణ పక్ష ఉత్సవాలు అంగరంగ వైభవంగా సోమవారంఘనంగా ప్రారంభించారు. ఉపరితల గని నందు 53 వ వార్షిక భద్రత పక్షోత్సవాల ను జనరల్ మేనేజర్( ఎక్స్ ప్లోజివ్స్& బిఎస్ ) ఎల్.వి సూర్యనారాయణ, కార్పోరేట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ కార్మికులందరికీ గని రక్షణాధికారి రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కన్వీనర్ ఎల్ వి సూర్యనారాయణ మాట్లాడుతూ రక్షణ సూత్రాలను ఎల్లప్పుడు పాటిస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని తెలిపారు. వార్షిక రక్షణ ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించినటువంటి క్విజ్ పోటీలు విజేతలకు, ఉత్తమ ప్రమాద రహిత ఉద్యోగులకు ఉత్తమ రక్షణ పై అవగాహన కలిగిన డిపార్ట్మెంటల్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం తనిఖీలో భాగంగా గనిలోని అన్ని విభాగాలను తనిఖీ చేసి వాటికి సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సూర్యనారాయణ తో పాటు కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు అధికారి ఎన్ వి ఆర్ ప్రహ్లాద్, మణుగూరు ఏరియా ఏజీఎం డీ లలిత్ కుమార్, మణుగూరు ఏరియా ఇంజనీర్ జి ప్రభాకర్ రావు, ఇల్లందు ఏరియా ఇంజనీర్ బి శంకరరావు, ఎస్ ఎస్ ఓ బి పిఏ ఏరియా జె.చంద్ర శేఖర్, ఇల్లందు అనిరాన్మెంట్ అడిషనల్ మేనేజర్ఎస్ ధనుంజయ రెడ్డి, ఇల్లందు ఏరియా రక్షణాధికారి పీ శ్రీనివాసు, మైనింగ్ వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ జి డేవిడ్, మైనింగ్ వర్క్ మెన్ రాజు నాయక్,ఎలక్ట్రికల్ బి ప్రసాద్ వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ మెకానికల్, డ�