*సింధు హాస్పిటల్లో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు*
మద్దూర్ (జనంసాక్షి), నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో చుట్టూ గ్రామ ప్రజలకు మంచి వైద్యం అందచాలని సింధు హాస్పిటల్ ప్రారంభించారు. గురువారం రోజు మద్దూర్ మండల ప్రజలకు ఉచితంగా గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సింధు హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ జి ప్రణయ్, గుండె వైద్య నిపుణుల చేత ఉచితంగా వైద్య సేవలు అందించారు. అదే విధంగా ఈసీజీ గుండె స్కానింగ్ బిపి షుగర్ టెస్టులు ఉచితంగా చేయడం జరిగింది. 120 మందికి ఉచిత గుండె వైద్య పరీక్షలు నిర్వహించమని డాక్టర్ ప్రణయ్ తెలిపారు.ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి సంజీవ్ కుమార్ హాజరయ్యారు. సింధు హాస్పిటల్ లో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు మద్దూర్ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..