హైదరాబాద్,(జనంసాక్షి): ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌తో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన 52 గంటల రాయలసీమ సింహగర్జన దీక్ష ఈ రోజు సాయంత్రంతో ముగిసింది. ఈ దీక్ష ప్రజాగాయకుడు గద్దర్ మద్దతు తెలిపారు. దీక్ష ముగింపు సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రజలను మేలుకొల్పేందుకు ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. రాయలసీమ నుంచి కర్మాగారాలు హైదరాబాద్‌కు తరలి వెళ్లిపోయినా సీమ నేతలెవ్వరూ నోరు మెదపలేదని విమర్శించారు. రాయలసీమలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయన్నారు.




